Kukatpally: జెడ్పీహెచ్‌ఎస్‌లో టీచర్స్ డే గురువులను సత్కరించిన ఎమ్మెల్యే!

Kukatpally: జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. గురువులను సత్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తాను చదివిన బడి జ్ఞాపకాలను నెమరువేసుకున్న ఎమ్మెల్యే.

Maruthisagar, Kukatpally
Published on: 5 Sept 2026 10:15 AM IST
Kukatpally
X

Kukatpally: జెడ్పీహెచ్‌ఎస్‌లో టీచర్స్ డే గురువులను సత్కరించిన ఎమ్మెల్యే!

Kukatpally: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగితే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎంతో సంతోషిస్తారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

కూకట్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కృష్ణారావు ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను గౌరవిస్తూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తారని అన్నారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఎమ్మెల్యేగా ఎదిగానని గుర్తుచేశారు. అనంతరం ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story