Osmania University: ఓయూలో కుమ్మర సంఘం గర్జన.. త్వరలో భారీ బహిరంగ సభకు పిలుపు!
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కుమ్మర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు నడికుడి జయంత్ రావు కీలక డిమాండ్లు చేశారు.
Osmania University: ఓయూలో కుమ్మర సంఘం గర్జన.. త్వరలో భారీ బహిరంగ సభకు పిలుపు!
Osmania University: కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరుల అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు. తమ సమస్యల పరిష్కారం కోసం భవిషత్తు కార్యాచరణ రూపొందించారు.
ఈ సందర్భంగా కుమ్మరి సంఘం అధ్యక్షుడు జయంత్ రావు, ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో మట్టి పాత్రల ఉత్పత్తి కోసం ప్రభుత్వం జీవోలు అమలు చేయాలన్నారు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి పాలక వర్గంతో 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మరులకు వృత్తి శిక్షణ కేంద్రాలు 33 జిల్లాల్లో ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన కుమ్మర వృత్తిదారులకు 5000/- పెన్షను ఇవ్వాలన్నారు. కుమ్మరలను ను బీసీ బి నుండి బీసీ ఏ కి మార్చాలని, అంతేకాకుండా కుమ్మరుల ఆత్మ గౌరవ భవనానికి 5 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవయిత్రి మొల్ల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం, డా. కంభంపాటి సత్యనారాయణ, మంచి రాజలింగం, బండారి భిక్షపతి, కే.లక్ష్మీ నారాయణ, టీకే శ్రీనివాస్, చందర్ రావు, వీరేశం, రామచందర్, నాగపురి నాగేష్, శ్యాం కుమార్, ఏరుకొండ శ్రీనివాస్, రాచకొండ కృష్ణయ్య, గుండాల గోవర్ధన్, జిల్లల శంకర్, సాయిలు, అశోక్, నాంపల్లి శ్రీనివాస్,మల్లెల ఉషారాణి,ఎగిరిశెట్టి వీరయ్య, నిమ్మలురీ శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.




