Kuntloor: కుంట్లూరు ఘనంగా సిపిఐ 'ప్రజా చైతన్య యాత్ర' ముగింపు సభ
Kuntloor: కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్‌లో సిపిఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ. కేంద్రంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు.
Kuntloor: కుంట్లూరు ఘనంగా సిపిఐ 'ప్రజా చైతన్య యాత్ర' ముగింపు సభ
కుంట్లూరు: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర’ ముగింపు సభ కుంట్లూరు సమీపంలోని రావి నారాయణరెడ్డి నగర్‌లో ఘనంగా నిర్వహించారు. భారీగా నిర్వహించిన ఈ బహిరంగ సభకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని సిపిఐ నాయకులు తెలిపారు.
రావి నారాయణరెడ్డి నగర్‌లోని గుడిసెలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూనంనేని స్పష్టం చేశారు. గుడిసెలు వేసుకున్న ప్రజల నుంచి ఈ భూమిని ఎవరూ తీసుకోలేరని, వారికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రావి నారాయణరెడ్డి నగర్ గుడిసెల విషయంలో ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.




