Kurchi Thatha: కుర్చీ తాత కన్నుమూత

Kurchi Thatha: సోషల్ మీడియా సంచలనం 'కుర్చీతాత' కన్నుమూశారు. వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన షేక్ అహ్మద్ పాషా (64) బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రాణాలు విడిచారు.

Arun Chilukuri
Published on: 21 May 2026 6:44 AM IST
Kurchi Thatha
X

Kurchi Thatha: కుర్చీ తాత కన్నుమూత

Kurchi Thatha: తనదైన మ్యానరిజంతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న షేక్‌ అహ్మద్‌ పాషా (64) అలియాస్‌ 'కుర్చీతాత' (కాలాపాషా) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా రోడ్లపైనే తిరుగుతున్న ఆయన, నగరంలో ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలి మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం మధ్యాహ్నం నగరంలోని కృష్ణకాంత్‌ పార్కులో అహ్మద్‌ పాషా అపస్మారకస్థితిలో పడిపోయి ఉండటాన్ని ప్రముఖ యూట్యూబర్‌ 'వైజాగ్‌ సత్య' గమనించారు. వెంటనే స్పందించిన ఆయన, కుర్చీతాతను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. అయితే, బుధవారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, తన ఒడిలోనే ప్రాణాలు వదిలారని భార్య ఆసియా సుల్తానా కన్నీటిపర్యంతమయ్యారు.

కుర్చీతాత స్వస్థలం వరంగల్‌ జిల్లాలోని కరీమాబాద్‌. ఇంటర్‌ వరకు చదువుకున్న అహ్మద్‌ పాషా.. దాదాపు 40 ఏళ్ల క్రితమే బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ప్రస్తుతం ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా కుమార్తె మహబూబ్‌ సుల్తానా వద్దే భార్యతో కలిసి ఆయన నివసిస్తున్నారు.

ఒక చిన్న ఇంటర్వ్యూ వీడియోతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిన కుర్చీతాత, ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లోని డైలాగ్స్‌కు, పాటలకు సైతం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, యూట్యూబర్లు సంతాపం ప్రకటిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story