Kushaiguda: కుషాయిగూడ పద్మావతి వెంకటేశ్వర ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

Kushaiguda: కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దేవి శరన్నవరాత్రులు వైభవంగా ముగిశాయి. చక్రస్నానం, పుష్పయాగంలో భక్తుల పూజలు.

ASHOK, KAPRA
Published on: 21 Oct 2026 10:40 PM IST
Kushaiguda
X

Kushaiguda: కుషాయిగూడ పద్మావతి వెంకటేశ్వర ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

కుషాయిగూడ: కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తిభావంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, చక్రస్నాన కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

ఉదయం నిత్యహోమం, బలిహరణం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, కలశ ఉద్వాసన పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

సాయంత్రం శ్రీ పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణలు, ధ్వజపట ఉద్వాసన, కంకణ ఉద్వాసన, ఆశీర్వచనం, పండిత సన్మానం తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మఠం వీరేశం మాట్లాడుతూ, భక్తుల సహకారం, అర్చకుల ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించి ఘనంగా ముగించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు కలకోట వెంకటరమణాచార్యులు, ఆరుట్ల నారాయణాచార్యులు, వేణుగోపాలాచార్యులు, బిటకూరి లక్ష్మణాచార్యులు, శేషాచార్యులు, వెంకటరమణరావు, సత్యనారాయణశర్మ, ఆలయ సిబ్బంది నరసింహం, మహేందర్, శ్రీను, దామోదర్, నాగరాజు, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA