Kushaiguda: కుషాయిగూడలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పరిశీలన
Kushaiguda: కుషాయిగూడ సాయి నగర్ కాలనీలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి.
Kushaiguda: కుషాయిగూడలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పరిశీలన
కుషాయిగూడ: కుషాయిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుషాయిగూడ సాయి నగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక బీఎల్ఓలతో కలిసి ఓటరు నమోదు, సవరణలు, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించారు. అనంతరం కుషాయిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌకుట్ల ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.
అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు వివరాల్లో మార్పులు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అలాగే ఓటర్లకు అవసరమైన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి అర్హ పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని మందుముల పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌకుట్ల ప్రకాశ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి కోఆర్డినేటర్ సీతారాం రెడ్డి,కాసుల పోచయ్య గౌడ్ మాజీ డివిజన్ అధ్యక్షులు ,సింగి రెడ్డి వెంకట రెడ్డి, కాసుల సతీష్ గౌడ్,సుజిత్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, హీరా లాల్ నాయక్, క్రాంతి కుమార్, అనిల్ యాదవ్, వినోద్, శ్యామ్, రాకేష్.మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నీరజ రెడ్డి, రమా రెడ్డి, అరుణ నాయక్, వరలక్ష్మీ, గిరిజ.యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ చరణ్ చారి, జనరల్ సెక్రటరీ సాకేత్ గౌడ్, ఈశ్వర్, రాకేష్, గని, గద్దల వంశీ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సాయి నగర్ కాలనీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




