Kushaiguda: సంతాన లక్ష్మిగా పద్మావతి అమ్మవారి దర్శనం: కుషాయిగూడ!

Kushaiguda: కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రుల వేళ అమ్మవారు సంతాన లక్ష్మిగా దర్శనమిచ్చారు.

ASHOK, KAPRA
Published on: 19 Oct 2026 8:30 PM IST
Kushaiguda
X

Kushaiguda: సంతాన లక్ష్మిగా పద్మావతి అమ్మవారి దర్శనం: కుషాయిగూడ!

కుషాయిగూడ: కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్ నవరాత్రుల సందర్భంగా సోమవారం 9వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం నాలుగవ రోజు విశేష పూజా కార్యక్రమంలో భాగంగా నిత్య హోమం, బలిహరణం, అశ్వవాహన సేవ పూజా అధికారి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఆలయం ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కలకోట వెంకటరమణచార్యులు, ఆరుట్ల నారాయణచార్యులు, వేణుగోపాలచార్యులు, బిటకూరి లక్మానాచార్యులు, శేషచార్యులు, వెంకటరమణ రావు, సత్యనారాయణ శర్మ, ఆలయ సిబ్బంది నరసింహం, మహేందర్,శ్రీను, దామోదర్,నాగరాజు, నాగమ్మ తదితరులు భక్తులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA