Tandur: సేవే లక్ష్యంగా కేవి ఫౌండేషన్.. విజయలక్ష్మి నేతృత్వంలో గొప్ప కార్యక్రమాలు
Tandur: తాండూరులో కె.వి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు, గర్భిణీలకు, విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షురాలు కంజర్ల విజయలక్ష్మి.
Tandur: సేవే లక్ష్యంగా కేవి ఫౌండేషన్.. విజయలక్ష్మి నేతృత్వంలో గొప్ప కార్యక్రమాలు
Tandur: గ్రామీణ పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే తాను స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని కే వి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కంజర్ల విజయలక్ష్మి గుర్తు చేశారు. సోమవారం రోజు తాండూరు పట్టణం గంజి మార్కెట్ యార్డు వద్ద గల సమావేశ మందిరంలో జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను రాజకీయాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాలలో సేవ చేయాలనే సంకల్పంతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలలో గర్భిణీ స్త్రీ గా ఉన్న మహిళ పుట్టింటి ఆడపడుచు వలే కెవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించి వారికి తల్లిదండ్రుల వలే ఆదరిస్తామని చెప్పారు.
అదేవిధంగా పుట్టిన ప్రతి బిడ్డకు ఫౌండేషన్ ద్వారా ఓ మంచి బహుమతిగా ఫౌండేషన్ కిట్టును అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పేద పిల్లల చదువు కోసం వారి బాగోగుల కోసం ఫౌండేషన్ అండగా ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్( తెలంగాణ రక్షణ సేన ) పార్టీ నాయకురాలు వీరమణి, హాజీపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాస్, కె.వి ఫౌండేషన్ ప్రతినిధులు జగదీశ్, అనిల్, రాజ్ కుమార్ సింగ్,సభనాజ్, సల్మాన్, నందు,క్రాంతి, ఉద్యమకారులు తదితరులు ఉన్నారు.




