Hyderabad: వైష్ణవి ఎంక్లేవ్‌లో విషాదం: ఉరివేసుకుని డాక్టర్ కీర్తి మృతి!
Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎంక్లేవ్‌లో డాక్టర్ కీర్తి (28) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Hyderabad: వైష్ణవి ఎంక్లేవ్‌లో విషాదం: ఉరివేసుకుని డాక్టర్ కీర్తి మృతి!
హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎంక్లేవ్‌లో ఆదివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన డాక్టర్ కీర్తి (28)కు ఇటీవల రాఘవతో వివాహం జరిగినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆమె కుషాయిగూడ వైష్ణవి ఎంక్లేవ్‌లో నివాసం ఉంటోంది.
ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. కీర్తి గత రెండేళ్లుగా ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలింపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కుషాయిగూడ పోలీసులు.
Next Story




