Lalapet: లాలాపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Lalapet: హైదరాబాద్ లాలాపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుక్క గణేష్ ముదిరాజ్. పాల్గొన్న నాయకులు.
Lalapet: లాలాపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
లాలాపేట: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లాలాపేటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుక్క గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.
అనంతరం దేశ స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపేందర్ యాదవ్, తునుకోజు శ్రీనివాస్ చారి, పోచయ్య యాదవ్, వేణు యాదవ్, బిక్షపతి యాదవ్, నవీన్, జే. వేణు, కృష్ణమూర్తి, అనిత, అనూష, సుధారాణి, శ్రీదేవి, మమత, విజయలక్ష్మి, శశి, రాజు జైన్, కరుణాకర్, ప్రమోద్ కుమార్, రామకృష్ణ, కృష్ణ, కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




