Lalapet: లాలాపేటలో రోడ్డు ఆక్రమణల తొలగింపు సీఐ శివప్రసాద్ హెచ్చరిక!

Lalapet: లాలాపేట నుండి ఫ్లవర్ మార్కెట్ ప్రధాన రహదారిపై ఆక్రమణలను తొలగించిన పోలీసులు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలని సీఐ శివప్రసాదరావు హెచ్చరిక.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Sept 2026 11:18 AM IST
Lalapet
X

Lalapet: లాలాపేటలో రోడ్డు ఆక్రమణల తొలగింపు సీఐ శివప్రసాద్ హెచ్చరిక!

Lalapet: ఈ రోజు లాలాపేట సి.ఐ. శివ ప్రసాద్ ఆధ్వర్యంలో లాలాపేట పోలీస్ సిబ్బంది, లాలాపేట నుండి ఫ్లవర్ మార్కెట్ వరకు గల ప్రధాన రహదారిపై ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించడం జరిగింది. రహదారిపై వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత వ్యాపారులు మరియు ప్రజలకు పలు సూచనలు చేయడం జరిగింది.

రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ఎటువంటి సామగ్రిని ఉంచరాదని, రోడ్డును ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదని సంబంధిత వ్యాపారులకు స్పష్టంగా సూచించడం జరిగింది. అదేవిధంగా, రోడ్డు ఆక్రమణలకు పాల్పడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాన్నారు.

ప్రజలు మరియు వ్యాపారులు పోలీసులకు సహకరించి, రహదారులను ఆక్రమించకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సహకరించాలని, లాలాపేట సిఐ శివప్రసాదరావు కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story