Lalapet: లాలాపేట పోలీసుల వినూత్న ఆలోచన: గణేష్ మండపాల వద్ద ఫ్లెక్సీలు

Lalapet: గణేష్ చతుర్థి సందర్భంగా లాలాపేట పోలీసులు మండపాల వద్ద సైబర్ నేరాలు, మహిళా రక్షణ, డ్రగ్స్ నివారణలపై ప్రత్యేక అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 13 Sept 2026 9:39 PM IST
Lalapet
X

Lalapet: లాలాపేట పోలీసుల వినూత్న ఆలోచన: గణేష్ మండపాల వద్ద ఫ్లెక్సీలు

Lalapet: గణేష్ చతుర్థి సందర్భంగా లాలాపేట పోలీసుల ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గణేష్ మండపాలకు వచ్చే భక్తులు, ప్రజలకు ముఖ్యమైన సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా ప్రతి గణేష్ మండపం వద్ద ప్రత్యేక అవగాహన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఫ్లెక్సీల ద్వారా ప్రధానంగా:

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత

మహిళల భద్రత మరియు రక్షణ

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు – “Say No to Drugs”

లాక్డ్ హౌస్ మానిటరింగ్

అత్యవసర సమయంలో డయల్ 112 వినియోగం

ప్రజల భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలు

వంటి విషయాలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పిస్తున్నారు.

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించడంతో పాటు, ఉత్సవాలకు వచ్చే భక్తులకు సామాజిక భద్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని లాలాపేట పోలీసులు తెలిపారు.

“ఉత్సవాల ఆనందంతో పాటు భద్రతపై అవగాహన కూడా అవసరం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN