Hayathnagar: లష్కర్‌గూడలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి!
Hayathnagar: హయత్‌నగర్ మండలం లష్కర్‌గూడ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Hayathnagar: లష్కర్‌గూడలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి!
హయత్నగర్: తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అయిన మహావీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా లష్కర్ గూడ గౌడ సంఘం ఆధ్వర్యంలో, మాజీ ఎంపీటీసీ సీక సాయికుమార్ గౌడ్ గారి నేతృత్వంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వీరత్వం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.
Next Story




