Hyderabad: నేను సైతం 2.0 నాగోల్ తట్టి అన్నారంలో 54 సీసీ కెమెరాలు ప్రారంభం
Hyderabad: తట్టి అన్నారంలో 54 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఎల్‌బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య. నాగోల్ పీఎస్ పరిధిలో నేను సైతం 2.0 కింద నివాసితుల చొరవ.
Hyderabad: నేను సైతం 2.0 నాగోల్ తట్టి అన్నారంలో 54 సీసీ కెమెరాలు ప్రారంభం
హైదరాబాద్: నేరాల నియంత్రణ, నేర పరిశోధనలో సీసీటీవీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఎల్‌బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన "నేను సైతం 2.0" కార్యక్రమంలో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం డబుల్ బెడ్‌రూమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో నివాసితులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న 54 సీసీటీవీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ, సీసీటీవీ కెమెరాలు నేరాల నివారణతో పాటు నేరస్థుల గుర్తింపు, నేరాల పరిశోధనలో కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమాజ భద్రతకు సహకరిస్తున్నారని, ఇది అభినందనీయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, వ్యాపార సంస్థలు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐ శివ నాగ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ దేవిడి వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ ఇన్‌చార్జ్‌లు రిజ్వాన్, భాస్కర్, దేవేందర్, మొహమ్మద్ ఖాతీజా బేగం తదితరులు పాల్గొన్నారు.




