LB Nagar: ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యల రగడ హైవేపై దిష్టిబొమ్మ దహనం
LB Nagar: విజయవాడ హైవేపై యాదగిరిగుట్ట బోర్డు డైరెక్టర్ ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ నేత శివ చరణ్ సస్పెండ్ చేయాలని బీసీ సంఘాలు ధర్నా చేశాయి.
LB Nagar: ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యల రగడ హైవేపై దిష్టిబొమ్మ దహనం
ఎల్బీనగర్: ఎల్బీనగర్_యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్_ పై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల నాయకులు భారీ ఆందోళన చేపట్టారు.
ఆందోళనకారులు విజయవాడ_జాతీయ రహదారిపై_ బైఠాయించి ధర్నా నిర్వహించారు. శివ చరణ్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పలు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వెంటనే జక్కిడి శివ చరణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను డిమాండ్ చేశారు.
లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళనతో సుమారు 10 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపు చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న పోలీసులు.




