LB Nagar: నాగోల్‌లో బీఆర్‌ఎస్ పోరుబాట - ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
LB Nagar: ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో బీఆర్‌ఎస్ పోరుబాట నిర్వహించారు. 22ఏ జాబితా బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
LB Nagar: నాగోల్‌లో బీఆర్‌ఎస్ పోరుబాట - ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్: “బీఆర్‌ఎస్ పోరుబాట” కార్యక్రమం నిర్వహణలో భాగంగా నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీ నందు జరిగిన పోరుబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు తమ జీవితకాల సంపాదనను వెచ్చించి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఆయా భూముల యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం వారికి న్యాయం చేయకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తుండటం దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.22ఏ సమస్యతో బాధపడుతున్న బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని అక్రమంగా 22ఏ జాబితాలో చేర్చిన భూములను పరిశీలించి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని బాధితులకు న్యాయం జరిగే వరకు “బీఆర్‌ఎస్ పోరుబాట” కొనసాగుతుందని సుధీర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్ బారసానాయకుడు అనంతుల రాజిరెడ్డి,డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి,మహేష్ రెడ్డి,సతీష్ యాదవ్,పల్ల శిల్పారెడ్డి,పోచంపల్లి రాజేందర్ రెడ్డి,మద్దెల వినయ్ కుమార్,శ్యాంసుందర్ రెడ్డి,రేవంత్ గౌడ్ మరియు చుట్టుపక్కల కాలనీ అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు




