LB Nagar: ఎల్బీనగర్‌లో గంజాయి గుట్టురట్టు రూ.4.5 లక్షల సరుకు పట్టివేత!

LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ వాసవి ఆనంద నిలయం వద్ద 8.928 కిలోల గంజాయి స్వాధీనం. ఒడిశా నుంచి తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్, రూ.4.50 లక్షల సరుకు సీజ్.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 2 Sept 2026 4:26 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్‌లో గంజాయి గుట్టురట్టు రూ.4.5 లక్షల సరుకు పట్టివేత!

LB Nagar: వాసవి ఆనంద నిలయం ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్టీఎఫ్‌-బీ టీమ్‌ తనిఖీలు చేపట్టింది. సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో 8.928 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి తరలిస్తున్న గంగామధుకమి, మున్నీకడియం అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో నిందితులు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లు వెల్లడించినట్లు సీఐ తెలిపారు.

ఈ గంజాయిని విజయ్‌ కురివి అలియాస్‌ రోషన్‌ అనే వ్యక్తికి అందించేందుకు తీసుకొచ్చినట్లు నిందితులు చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో విజయ్‌ కురివి అలియాస్‌ రోషన్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ బిక్షారెడ్డి తెలిపారు. అరెస్టయిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story