LB Nagar: ఎల్బీనగర్ చౌరస్తాలో బీసీ సంఘాల భారీ ధర్నా

LB Nagar: గౌడ సామాజిక వర్గాన్ని దూషిస్తూ టీపీసీసీ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు చేసిన వ్యాఖ్యలపై ఎల్బీనగర్ లో బీసీ, గౌడ సంఘాలు ఉధృత ఆందోళన చేపట్టాయి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 July 2026 2:11 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్ చౌరస్తాలో బీసీ సంఘాల భారీ ధర్నా

LB Nagar: ఎల్బీనగర్ గౌడ సామాజిక వర్గాన్ని దూషిస్తూ టీపీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీసీ సంఘాలు, గౌడ సంఘాలు ఎల్బీనగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

బీసీలను దుర్భాషలాడుతూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివ చరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపాయి.

వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తండ్రి కొడుకులను పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశారు.

బహుజన వర్గాలను కించపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story