LB Nagar: రూ.2.52 లక్షలు పలికిన హనుమాన్‌నగర్ గణేశుడి లడ్డూ!
LB Nagar: హనుమాన్‌నగర్‌లో గణేశ్ లడ్డూ రికార్డు ధర: రూ.2,52,200 పలికిన గణపతి లడ్డూ ప్రసాదం, రూ.45 వేలకు స్వామివారి కండువా వేలం. ఘనంగా ముగిసిన నవరాత్రోత్సవాలు.
LB Nagar: రూ.2.52 లక్షలు పలికిన హనుమాన్‌నగర్ గణేశుడి లడ్డూ!
ఎల్బీనగర్: హనుమాన్‌నగర్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. హనుమాన్‌నగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది.
గణనాథుడి లడ్డూ రూ.2,52,200కు వేలంలో పలికింది. వనస్థలిపురానికి చెందిన అవిసా కన్స్ట్రక్షన్స్ అధినేత నెల్లికొండ సురేందర్‌రెడ్డి, ఉప్పల్‌కు చెందిన ఎంకేఎస్ లేడీస్ హాస్టల్ ప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో లడ్డూను దక్కించుకున్నారు.
అదేవిధంగా నవరాత్రుల్లో స్వామివారి మెడలో అలంకరించిన కండువా కూడా వేలం వేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యాదాటి నాగమోహన్ రూ.45 వేలకు కండువాను దక్కించుకున్నారు.
గత 18 ఏళ్లుగా హనుమాన్‌నగర్‌లో గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి, నిత్యం ప్రత్యేక పూజలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గణనాథుడిని భారీ ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.




