Hayathnagar: యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తామన్న జోనల్ కమిషనర్ ఎమ్మెల్యే!

Hayathnagar:కుమ్మరికుంట చెరువు కట్ట రోడ్డును ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జోనల్ కమిషనర్ వికాస్ మహతో పరిశీలించి నూతన రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు.

AJAY, HAYATH NAGAR
Published on: 14 Aug 2026 11:12 PM IST
Hayathnagar
X

Hayathnagar: యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తామన్న జోనల్ కమిషనర్ ఎమ్మెల్యే!

హయత్‌నగర్: కుమ్మరికుంట చెరువు కట్టపై ఉన్న రోడ్డుపై ప్రయాణికులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ మేరకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోను వెంట తీసుకుని కుమ్మరికుంట చెరువు వద్దకు వెళ్లి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని నూతన రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు చెరువు కట్టను వెడల్పు చేయాలని జోనల్ కమిషనర్‌ను కోరారు.

దీనిపై జోనల్ కమిషనర్ వికాస్ మహతో వెంటనే స్పందిస్తూ, కట్ట వెడల్పు మరియు నూతన రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులను యుద్ధప్రాతిపదికన మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కుమ్మరికుంట చెరువు రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు త్వరలో ఇబ్బందులు తొలగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story