LB Nagar: శారదానగర్‌లో వరద కాలువ పనులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన!
LB Nagar: శారదానగర్ కాలనీ ఫేజ్-3లో వరద ముంపు సమస్య పరిష్కారానికి కాలువ, పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
LB Nagar: శారదానగర్‌లో వరద కాలువ పనులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన!
ఎల్‌బీనగర్: హైకోర్ట్ నగర్ డివిజన్ పరిధిలోని శారదానగర్ కాలనీ ఫేజ్-3లో ఏళ్లుగా ప్రధాన సమస్యగా ఉన్న వరద నీటి మళ్లింపు సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. కాలువ నిర్మాణం, పైప్‌లైన్ ఏర్పాటుకు ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
కాలనీలో వర్షాలు కురిసిన ప్రతిసారీ పైనుంచి వచ్చే వరద నీటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాలువ నిర్మాణం, పైప్‌లైన్ ఏర్పాటుకు అవసరమైన అభివృద్ధి పనులకు సహకారం అందించారు.
పనులు పూర్తయితే వర్షాకాలంలో పైప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ముంపు నుంచి శారదానగర్ ఫేజ్-3 వాసులకు ఉపశమనం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రధాన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
కార్యక్రమంలో శారదానగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రదీప్ రావు, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు దీపావళి శ్రవణ్ కుమార్, గుత్తా లక్ష్మణ్ రెడ్డి, దీపావళి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు, కాలనీ పెద్దలు, శ్రేయోభిలాషులు, మహిళా విభాగం సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.




