LB Nagar: పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి: సుధీర్ రెడ్డి!

LB Nagar: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 30 Oct 2026 11:05 AM IST
LB Nagar
X

LB Nagar: పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి: సుధీర్ రెడ్డి!

ఎల్బీనగర్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

లింగోజిగూడ డివిజన్ పరిధిలోని పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు తిలక్ రావు, రాకేష్ ఠాగూర్, గంగపుత్ర భాస్కర్, నర్సింహా గుప్తా, జగన్నాథ్ రెడ్డి, తోట రాజశేఖరరెడ్డి, దయానంద్, పార్షపు శ్రీధర్, శ్రీకాంత్, కుమార్, చిత్రం సాయి, ఆనంద్, ప్రసాద్, ప్రకాష్, వెంకట్ రెడ్డి, ఉమామహేశ్వర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR