BN Reddy: ఫలహార బండి ఊరేగింపులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి!
BN Reddy: నియోజకవర్గం బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్ మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో జరిగిన బోనాల ఫలహార బండి ఊరేగింపులో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
BN Reddy: ఫలహార బండి ఊరేగింపులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి!
బిన్ రెడ్డి : బోనాల పండుగ నేపథ్యంలో బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ కాలనీ_లో నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫలహార బండి ఊరేగింపులో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధి చింతల రవికుమార్, నిర్వాహకులు అఖిలేష్ గౌడ్, సుజనా, కాలనీ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




