LB Nagar: ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్ కీలక భేటీ!
LB Nagar: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నివాసంలో ఎస్‌ఐఆర్ (SIR) సమీక్షా సమావేశం. ప్రతి ఓటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం.
LB Nagar: ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్ కీలక భేటీ!
LB Nagar: ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు SIR ప్రక్రియపై నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆదివారం ఎల్బీనగర్ లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ SIR ప్రక్రియపై గౌరవ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.రామారావు గారు ముందుగానే నియోజకవర్గ శ్రేణులకు అవగాహన కల్పించారని గుర్తు చేశారు.
నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు SIR ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నాయకులకు ఆదేశించారు.
ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల కోసం అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత ఎన్నికల అధికారులను వెంటనే సంప్రదించాలని తెలిపారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




