LB Nagar: కొత్తపేట కాలనీల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటన
LB Nagar: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కొత్తపేట డివిజన్‌లోని పలు కాలనీల్లో ముమ్మరంగా పర్యటించారు.
LB Nagar: కొత్తపేట కాలనీల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటన
LB Nagar: కొత్తపేట డివిజన్ పరిధిలోని శివశంకర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, శివగంగ కాలనీ, శ్రీనివాస కాలనీలలో ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పర్యటించారు. స్థానిక ప్రజల మంచినీటి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ.. దాదాపు నెల రోజులుగా మంచినీటి సరఫరాలో లో ప్రెషర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అక్కడి నుంచే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీల్లో మంచినీటి సరఫరాకు ప్రెషర్ లేకుండా చూసేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. "ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం" అని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్, మహేష్ రెడ్డి, విశ్వేశ్వరరావు, మల్లేపాక యాదగిరి, గాలయ్య, ఇటికల యాదగిరి, యాసిన్, బట్టు అంజయ్య, జోగు నగేష్, బాలాజీ, జోగు కృష్ణ, స్థానిక లైన్‌మెన్ విఠల్, చుట్టుపక్కల కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




