LB Nagar: మధురానగర్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గం మధురానగర్, వెస్ట్ ఆగమయ్యనగర్‌లలో డ్రైనేజీ, వరద నీటి నిల్వ సమస్యలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ZC వికాస్ మహతో పరిశీలించారు.
LB Nagar: మధురానగర్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే
LB Nagar: వర్షం పడితే మధురానగర్ వాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చేనీరు మధురానగర్ వద్ద నిలిచిపోతుండటంతో చిన్నపాటి వర్షానికే కాలనీలో మోకాళ్ల లోతు నీరు చేరుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చొరవ తీసుకున్నారు.
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో కలిసి నాగోల్ డివిజన్ మధురానగర్‌లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంద్రప్రస్థ కాలనీ, ధనలక్ష్మినగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద, డ్రైనేజీ నీరు మధురానగర్‌లో నిలిచిపోతున్న తీరును అధికారులకు వివరించారు. గతంలో ఏర్పాటు చేసిన చిన్న ఔట్‌లెట్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని తెలిపారు.
చిన్న ఔట్‌లెట్‌తో సమస్య తీరదు.. పెద్ద ఔట్‌లెట్ నిర్మించాలి అని ఎమ్మెల్యే అధికారులను కోరారు. పెద్ద ఔట్‌లెట్ ఏర్పాటు చేస్తే వరదనీరు సాఫీగా వెళ్లిపోయి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ వికాస్ మహతో పెద్ద ఔట్‌లెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మాన్సూరాబాద్ డివిజన్ వెస్ట్ ఆగమయ్యనగర్‌లోనూ ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ కలిసి పర్యటించారు. అను ఫర్నిచర్ సమీపంలో దెబ్బతిన్న రోడ్డును, పొంగిపొర్లుతున్న డ్రైనేజీని పరిశీలించారు. రోడ్డును వెంటనే నిర్మించాలని, ఓపెన్ నాలాను అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌గా మార్చి రహదారిని వెడల్పు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే చేపడతామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, కాలనీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.




