LB Nagar: ఎల్బీనగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. పలు డివిజన్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 15 Aug 2026 9:41 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎల్బీనగర్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, విద్యార్థులు, కాలనీవాసులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి చాటారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పలు డివిజన్లలో జరిగిన వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జైహింద్.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు జాతీయ జెండాలతో పాల్గొనడంతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. స్వాతంత్ర్య స్ఫూర్తితో.. ప్రజల భాగస్వామ్యంతో.. ఎల్బీనగర్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story