LB Nagar: నియోజకవర్గంలో క్రీడా మైదానాల అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి!

LB Nagar: బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద ఉన్న ఆట స్థలాన్ని పరిశీలించారు. యువత రాత్రి వేళల్లో ఆడుకునేలా హైమాస్ట్ లైటింగ్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 July 2026 3:59 PM IST
LB Nagar
X

LB Nagar: నియోజకవర్గంలో క్రీడా మైదానాల అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి!

LB Nagar: ఈరోజు ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన ఆట స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి యువత రాత్రి వేళల్లో కూడా సౌకర్యవంతంగా,సురక్షితంగా ఆటలు ఆడుకునేందుకు అవసరమైన హైమాస్ట్/ఎల్‌ఈడీ లైటింగ్‌ను గతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.త్వరితగతిన అట్టి లైటింగ్ కనెక్షన్ ఇవ్వాలని ఫోన్లో అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ యువతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం.రాత్రి సమయంలో కూడా సురక్షితంగా ఆటలు ఆడుకునేలా నాణ్యమైన లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆట స్థల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపడతాం.

అలాగే కొన్ని క్రీడా పరికరాలు విరిగిపోవడం జరిగింది అని వాటిని వెంటనే రిపేర్ చేయించాలని ఆదేశించారు.క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే అవకాశం కల్పించడమే మా లక్ష్యం" అని తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story