LB Nagar: చంపాపేట్‌లో మెర్క్యురీ ఈవీ టెక్ షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే!

LB Nagar: చంపాపేట్ విరాట్ నగర్‌లో శ్రీ లక్ష్మీ గణేష్ మోటార్స్ - మెర్క్యురీ ఈవీ టెక్ షోరూమ్‌ను ప్రారంభించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 1 Nov 2026 12:46 PM IST
LB Naga
X

LB Nagar: చంపాపేట్‌లో మెర్క్యురీ ఈవీ టెక్ షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే!

LB Nagar: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు మరింత దోహదం చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని విరాట్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణేష్ మోటార్స్ – మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ షోరూమ్‌ను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి :తీసుకురావడం అభినందనీయమన్నారు. పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు, పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈవీల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం నూతన షోరూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు డాక్టర్ జయేష్ ఠక్కర్ పాల్గొన్నారు. డి. శ్రీనివాస్ రంగేశ్వరి ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో VRR ఎంటర్‌ప్రైజెస్ హైదరాబాద్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించింది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR