LB Nagar: గడ్డిఅన్నారం కాలనీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

LB Nagar: ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గడ్డిఅన్నారం పరిధిలోని న్యూ గడ్డిఅన్నారం కాలనీలో మార్నింగ్ వాక్ చేస్తూ స్థానిక సమస్యలను పరిశీలించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 24 May 2026 4:06 PM IST
LB Nagar
X

LB Nagar: గడ్డిఅన్నారం కాలనీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

LB Nagar: ఈరోజు ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మార్నింగ్ వాక్‌లో భాగంగా గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని న్యూ గడ్డిఅన్నారం కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలపై పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ నూతన కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా న్యూ గడ్డిఅన్నారం ప్రాంతంలో వరదనీటి సమస్యల పరిష్కారం కోసం అదనపు బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, ఇప్పటికే నిలిచిపోయిన బాక్స్ డ్రైన్ల మరమ్మతు పనులను రాబోయే వర్షాకాలానికి ముందే శరవేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నందున కొత్త రోడ్లు నిర్మించాలని, కాలనీలో భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో బాక్స్ డ్రైన్ల నిర్మాణాల కోసం సుమారు రూ.22 కోట్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులను మళ్లీ మంజూరు చేయించి బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన బాక్స్ డ్రైన్స్ పనులు అధికారులతో మాట్లాడి పూర్తి చేయిస్తామని తెలిపారు.

అలాగే నూతన రోడ్లు, సీ.సీ.కెమెరాలు కూడా మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యాదగిరి, కార్యవర్గ సభ్యులు అర్జున్ రావు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు రమేష్ ముదిరాజ్, బిచేనేపల్లి వెంకటేశ్వర రావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, శ్రీశైలం యాదవ్, గండి సన్నీ యాదవ్, ప్రదీప్, రాము తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story