Champapet: అవసరం లేని చోట ఫ్లైఓవర్ ఎందుకు.. ఎమ్మెల్యే దేవిరెడ్డి

Champapet: చంపాపేట్ డివిజన్ ఓవైసీ చౌరస్తా నుండి కర్మన్‌ఘాట్ మార్గంలో నూతన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వ్యతిరేకించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 April 2026 7:04 PM IST
Champapet
X

Champapet: అవసరం లేని చోట ఫ్లైఓవర్ ఎందుకు.. ఎమ్మెల్యే దేవిరెడ్డి

Champapet: ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..ఈ రోజు చంపాపేట్ డివిజన్ పరిధిలోని ఓవైసీ నుంచి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం వెళ్లే ప్రధాన రహదారిపై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్బంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ ఇట్టి ప్రభుత్వం టీ.కె.ఆర్.కమాన్ చౌరస్తా నుండి ఓవైసి చౌరస్తా వరకు ఆరు లైన్ల విస్తరణ పేరిట దాదాపు 240 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది.

నూతన ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఎన్నో ఏండ్ల నుండి నివాసం ఉంటున్న మేము ఎక్కడికి పోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ఉన్న వసతులు మా ఏరియాలో 150 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉందని తెలిపారు.కానీ మళ్ళీ ఇప్పుడు 25 ఫీట్ల మేరకు రోడ్డు విస్తరణ పేరిట మా ఇల్లు కూలగొట్టడం జరుగుతుంది అని తెలపడం ఎంతవరకు సబాబు అని అన్నారు. జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు కోల్పోవడం వల్ల మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది కావున ఇట్టి నూతన ఫ్లైఓవర్ ప్రతిపాదనలు విరమించుకోవాలని కోరారు.

అనంతరం సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ ఉన్న 150 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల భవిష్యత్తులో దాదాపు మరో 25 సంవత్సరాల వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెలిపారు.ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదని అన్నారు.గతంలో నేను బండ్లగూడ ఆనంద నగర్ చౌరస్తా మరియు హస్తినాపురం చౌరస్తా వద్ద నూతన ఫ్లైఓవర్ మంజూరు చేయాలని కోరడం జరిగింది. అక్కడ ప్రతినిత్యం ఉదయం మరియు సాయంత్రం తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని తెలిపారు.

కానీ అక్కడ మంజూరు చేయకుండా ఇక్కడ మంజూరు చేయడం హాస్యాస్పదం అని అన్నారు.ఇట్టి నూతన ఫ్లైఓవర్ విషయంలో ప్రభుత్వం దృష్టికి పెద్దఎత్తున తీసుకెళ్లి విరమింపచేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో భారస నాయకులు రాజిరెడ్డి, ముద్ద కళ్యాణ్, చలమల యాదిరెడ్డి, రవి ముదిరాజ్, ప్రభాకర్, కనకేష్, జంగయ్య, చందు, శ్రీనివాస్, రమాదేవి కాలనీవాసులు జగదీశ్, నవరత్నం, నర్సింహా, సురేష్, శ్యామ్, శ్రీనివాస్ సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story