LB Nagar: జయచంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి శిక్షణ!
LB Nagar: చంపాపేటలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపు.
LB Nagar: జయచంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి శిక్షణ!
LB Nagar: జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంపాపేట డివిజన్ యువ నాయకులు సంధ్య రవి ముదిరాజ్ అధ్యక్షతన చంపాపేట డివిజన్ పరిధిలోని మోడల్ మార్కెట్ బిల్డింగ్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన మహిళా సోదరీమణులకు సర్టిఫికెట్లను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు,ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి కమల సుధీర్ రెడ్డి గార్లు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మహిళ చేతిలో నైపుణ్యం ఉంటే ఒక కుటుంబం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని, ఒక కుటుంబం ఎదిగితే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలనే లక్ష్యంతో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ శిక్షణలో ప్రాథమిక స్థాయి నుంచి ఆధునిక కుట్టు నైపుణ్యాలతో పాటు బ్యూటీషియన్, మెహందీ వంటి ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కోర్సుల్లో సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు, తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేసుకునే అవకాశం పొందుతారని అన్నారు.
మహిళల నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో రమాదేవి,ఉష, ప్యారి,కవిత,లావణ్య,స్వయం ప్రభు మరియు ట్రస్ట్ ప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,శిక్షణ పొందిన మహిళలు,స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.




