LB Nagar: బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడిగా పారంద సాయి

LB Nagar: బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడిగా పారంద సాయి నియామకం. పార్టీ బలోపేతానికి, యువజన సంక్షేమ పథకాల ప్రచారానికి కృషి చేస్తానని వెల్లడి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 23 Oct 2026 6:13 PM IST
LB Nagar
X

LB Nagar: బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడిగా పారంద సాయి

ఎల్బీనగర్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడిగా పారంద సాయి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు సాయిరాం గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పారంద సాయి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను బీజేపీ వైపు ఆకర్షించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యువజన సంక్షేమ పథకాలపై యువతకు అవగాహన కల్పించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పారంద సాయి పేర్కొన్నారు.

లెక్చరర్స్ కాలనీ డివిజన్‌–47కు చెందిన పారంద సాయికి బీజేవైఎం జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR