LB Nagar: నమాజ్‌కు వెళ్లిన కొడుకు శవమై వచ్చాడు.. ఎల్బీనగర్‌లో విషాదం!

LB Nagar: ఎల్బీనగర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 16 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరు స్నేహితులు గాయపడ్డారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 13 Sept 2026 9:29 PM IST
LB Nagar
X

LB Nagar: నమాజ్‌కు వెళ్లిన కొడుకు శవమై వచ్చాడు.. ఎల్బీనగర్‌లో విషాదం!

ఎల్బీనగర్: నమాజ్ చేసేందుకు స్నేహితులతో కలిసి బైక్‌పై బయలుదేరిన 16 ఏళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఎల్బీనగర్ ఎక్స్‌రోడ్డులోని సితార హోటల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

మలక్‌పేటకు చెందిన సయ్యద్ ముష్తాక్ హుస్సేన్ పెద్ద కుమారుడు సయ్యద్ మాజ్ హుస్సేన్ (16) ఆదివారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటలకు నమాజ్ కోసం తన ఇద్దరు స్నేహితులు హంజాలా (16), అలీ (16)తో కలిసి బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు.

సుమారు 5 గంటల సమయంలో ఎల్బీనగర్ ఎక్స్‌రోడ్డులోని సితార హోటల్ సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురూ గాయపడగా, స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఎల్బీనగర్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు.

అంబులెన్స్ సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో మాజ్ హుస్సేన్ తండ్రి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే వైద్యులు పరీక్షించి మాజ్ హుస్సేన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడి వెంట ఉన్న ఇద్దరు స్నేహితులకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై మృతుడి తండ్రి సయ్యద్ ముష్తాక్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నంబర్ 1215/2026, BNS సెక్షన్లు 106(1), 125(a) కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR