LB Nagar: ఎల్బీనగర్ పరిధిలో రౌడీషీటర్ నహీమ్ దారుణ హత్య!

LB Nagar: పరిధిలో రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ హత్య కేసులో సెటిల్మెంట్ల డబ్బుల వివాదమే కారణమని, ప్రాణ స్నేహితుడు ఉమామహేశ్వర్ ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 15 Sept 2026 12:58 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్ పరిధిలో రౌడీషీటర్ నహీమ్ దారుణ హత్య!

LB Nagar: నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో జరిగిన రౌడీషీటర్‌ మహమ్మద్‌ నహీమ్‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పాత కక్షలు, సెటిల్మెంట్ల డబ్బుల విషయంలో నెలకొన్న వివాదమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.

ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్‌ అలియాస్‌ జేకే మహేష్‌, మహమ్మద్‌ నహీమ్‌ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితులు.

అయితే గత మూడు నెలలుగా సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు.

బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహమ్మద్‌ నహీమ్‌పై మహేష్‌ అండ్‌ టీం దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇద్దరిపై ఇప్పటికే ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో పలు హత్య కేసులతో పాటు రౌడీషీట్లు ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్ల మధ్య మొదలైన డబ్బుల వివాదం చివరకు నహీమ్‌ హత్యకు దారితీయడం కలకలం రేపుతోంది.

హత్య అనంతరం పరారీలో ఉన్న మహేష్‌ అండ్‌ టీం కోసం నాగోల్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR