LB Nagar: ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణకు రూ 1.61 కోట్ల నిధులు!

LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 1.61 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మధుయాష్కి గౌడ్ చొరవతో పనులు ప్రారంభం కానున్నాయి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 19 Aug 2026 4:04 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణకు రూ 1.61 కోట్ల నిధులు!

LB Nagar: నియోజకవర్గంలోని పలు చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు నిధులు మంజూరయ్యాయి. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ చొరవతో చెరువుల కట్టలపై వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, బెంచీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.

ఇటీవల నియోజకవర్గంలోని బండ్లగూడ, నాగోల్ చెరువులతో పాటు సాహెబ్‌నగర్, బి.ఎన్.రెడ్డి డివిజన్ల పరిధిలోని కాప్రాయి చెరువును మధుయాష్కి గౌడ్ సందర్శించారు. అంతకుముందు బాతుల చెరువు, కుమ్మరికుంటలను పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పలు చెరువుల కట్టలపై వాకింగ్ ట్రాక్‌లు లేకపోవడం, ఉన్న చోట్ల నిర్వహణ లోపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. చెరువుల వద్ద లైటింగ్ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఈ అంశాలపై జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో సమావేశమైన మధుయాష్కి గౌడ్.. చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజలు ఉదయం, సాయంత్రం సౌకర్యవంతంగా వాకింగ్ చేసుకునేలా ట్రాక్‌లు, వీధి దీపాలు, బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

మంజూరైన నిధులు

బండ్లగూడ చెరువు: వాకింగ్ ట్రాక్, లైటింగ్, బెంచీలకు రూ.41 లక్షలు

నాగోల్ చెరువు: వాకింగ్ ట్రాక్, లైటింగ్, బెంచీలకు రూ.64 లక్షలు

మన్సూరాబాద్ చిన్న చెరువు: వాకింగ్ ట్రాక్, సుందరీకరణకు రూ.10 లక్షలు

సాహెబ్‌నగర్ కాప్రాయి చెరువు, హయత్‌నగర్ బాతుల చెరువు: వాకింగ్ ట్రాక్, లైటింగ్, బెంచీలకు రూ.46 లక్షలు

మొత్తం రూ.1.61 కోట్లతో చెరువుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story