LB Nagar: ఎల్.బి.నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
LB Nagar: ఎల్.బి.నగర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.
LB Nagar: ఎల్.బి.నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
ఎల్.బి.నగర్: తెలంగాణ వీరుడు, ధీరుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఎల్.బి.నగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాపన్న గౌడ్ ధైర్యసాహసాలను, బలహీన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి గోవిందచారి, బీజేపీ నాయకులు రమణ, జిల్లా మహిళా నాయకురాలు పార్వతి, అరుణ్, బీజేవైఎం హయత్‌నగర్ ప్రధాన కార్యదర్శి అభిలాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




