LB Nagar: ఎల్బీనగర్ సిరి నగర్‌లో అర్ధరాత్రి బీభత్సం.. రెండు బైక్‌లకు నిప్పు!
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు రెండు బైక్‌లకు నిప్పుపెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
LB Nagar: ఎల్బీనగర్ సిరి నగర్‌లో అర్ధరాత్రి బీభత్సం.. రెండు బైక్‌లకు నిప్పు!
ఎల్బీనగర్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరి నగర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. ఇళ్ల ముందు పార్క్ చేసి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు కాలనీలోకి ప్రవేశించి, నివాసాల ముందు నిలిపి ఉంచిన రెండు బైక్‌లకు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధం కాగా, మరో బైక్ పాక్షికంగా కాలిపోయింది.
కాగా, బైక్‌లకు నిప్పు పెట్టి దుండగులు అక్కడి నుంచి పరారవుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదే కాలనీలో గతంలోనూ రెండు కార్లకు నిప్పు పెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. వరుసగా వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దుండగులు నిప్పు పెడుతుండటంతో కాలనీవాసుల్లో ఆందోళన నెలకొంది.
బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుస వాహన దహన ఘటనలకు పాల్పడుతున్న వారిని త్వరగా పట్టుకుని, కాలనీలో భద్రత కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.




