LB Nagar: రూ. 87 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ లో స్కైవాక్ నిర్మాణం : మధుయాష్కిగౌడ్
LB Nagar: ఎల్బీనగర్ చౌరస్తాలో రూ. 87 కోట్లతో భారీ స్కైవాక్ నిర్మాణానికి శ్రీకారం.
LB Nagar: రూ. 87 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ లో స్కైవాక్ నిర్మాణం : మధుయాష్కిగౌడ్
LB Nagar: ఎల్బీనగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో రూ. 87 కోట్లతో స్కైవాక్ ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. ఎల్బీనగర్ చౌరస్తాలో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు, నాయకులతో కలిసి మధుయాష్కీ గారు ఈరోజు పరిశీలించారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. ఎల్బీనగర్ రింగ్రోడ్డులో స్కైవాక్ నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, ప్రజలకు రోడ్డు దాటే అవస్థలు తప్పుతాయన్నారు. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా నాలుగు వైపులా ప్రజలు వెళ్లేలా స్కైవాక్ నిర్మాణం ఉంటుందన్నారు. 1725 మీటర్ల పొడవు తో పలు చోట్ల లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తూ ఉంటుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హైదరాబాదు నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎల్బీనగర్ నియోజకవర్గం లో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మొన్న బి.ఎన్.రెడ్డి నగర్ లో ఏకో పార్కు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం గారు, తాజాగా స్కైవాక్ నిర్మాణానికి అనుమతులు ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో వర్షం నీరు నిలువకుండా రూ. 81 లక్షలతో వరద నీటి పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రూ. 1.50 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు కూడా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. రూ. 1.37 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు వద్ద సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో డిప్యుటీ కమిషనర్ శ్రీనివాస్ గారు, ఈఈ కార్తీక్ గారు, డీఈ కనకయ్య గారు, యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ గారు, జీహెచ్ ఎం సీ మాజీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కుట్ల నర్సింహా యాదవ్ గారు, మకుటం సదాశివుడు గారు, బుడ్డ సత్యనారాయణ గారు, చెన్నగోని రవీందర్ గారు గౌడ్ గారు, వేణుగోపాల్ యాదవ్ గారు, మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ గారు, నేలపాటి రామారావు గారు తదితరులు పాల్గొన్నారు.




