Hyderabad: పండ్ల చెట్లతోనే జీవ వైవిధ్యం వనస్థలిపురంలో గ్రీన్ కేక్ కటింగ్

Hyderabad: లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం ప్రతినిధి లయన్ పాప వెంకటరెడ్డి 52వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ నాగిరెడ్డి కాలనీలో 52 పెద్ద సైజ్ పండ్ల మొక్కలను నాటారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 23 Jun 2026 12:54 PM IST
Hyderabad
X

Hyderabad: పండ్ల చెట్లతోనే జీవ వైవిధ్యం వనస్థలిపురంలో గ్రీన్ కేక్ కటింగ్

హైదరాబాద్: ఎల్బీనగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం, జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నాగిరెడ్డి కాలని వీధులలో సంక్షేమ సంఘంవారి సహకారంతో పెద్ద సైజ్ పండ్ల మొక్కలను నాటి సంరక్షణ గార్డులు ఏర్పాటు. నాటిన మొక్కలను నీరు పోసి సంరక్షిస్తామని కంకణ ధారణ చేసి ప్రమాణం చేసిన కాలనీ వాసులు, సంక్షేమ సంఘం ప్రతినిధులు.

విష రసాయనాలతో పండించిన పండ్లు తినడం వలన ఎదురయ్యే అనారోగ్య సమస్యలను అధిగమించడంతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణకు పండ్ల చెట్లు పెంచడం అవసరం అని భావించి గత కొన్ని సంవత్సరాలుగా ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో కొన్ని వందల పండ్ల చెట్లు నాటి దత్తతనిస్తూ పెంచుతున్న జాగృతి అభ్యుదయ సంఘం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్ధలిపురంతో కలిసి సాహెబ్ నగర్ డివిజన్ నాగిరెడ్డి కాలనీలో సంక్షేమ సంఘం వారి సహకారంతో పండ్ల చెట్లు నాటడమైనది.,

పోలీస్ కాలని ఆంజనేయ స్వామి దేవాలయం పూజారి ఈశ్వర శర్మ గారి ఆశీర్వచనంతో లయన్ పాప వెంకటరెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలను ఆరోగ్యాన్నిచ్చే గ్రీన్ కేక్ (పుచ్చపండు)కటింగ్ తో మన భారతీయ సంప్రదాయం ఐన నూనె దీపం వెలిగించి ప్రారంభించడమైనది.

భావన శ్రీనివాస్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ విట్టా దూరయ్య, లయన్ పి.రవీందర్ రెడ్డి, లయన్ జి. రాం ప్రసాద్ లు మాట్లాడుతూ కాలనీ వీధుల్లో సహజ ఎరువులతో పండ్ల చెట్లు పెంచడం వలన మనకు మంచి రుచితో కూడిన తాజా పండ్లు లభిస్తాయని, కోతులు మన ఇండ్లలోకి వస్తాయనే భయం ఉండదని, కోతులు, ఉడుతలు,పక్షులు తదితర జీవులకు ఆహారం దొరికి జీవ వైవిధ్యం కాపాడబడుతుందని అన్నారు.

దాని వలన ప్రకృతి సమతుల్యత కాపాడబడి ఋతువులు గతి తప్పకుండా సరైన సమయానికి వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణకు తమ కాలనీని ఎంచుకుని చెట్లు నాటిన రెండు స్వచ్ఛంద సంస్థలకు నాగిరెడ్డి కాలని సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్ పి. వెంకట్ రెడ్డి సతీమణి రమాదేవి, లయన్ జి.. గిరిజాపతి, లయన్ G.నర్సింహులు, లయన్ జి. నారాయణరెడ్డి నాగిరెడ్డి కాలని గౌరవాధ్యక్షులు పూల్ సింగ్, ఉపాధ్యక్షులు సి. వెంకటేష్, కార్యక్రమ కన్వీనర్/ప్రకృతి ప్రేమికురాలు పద్మావతి, చెట్లు పెంచుకునే కె. శ్రీధర్, యన్. శివ, భాను, మురళి, హరికృష్ణ, త్రిగుణ్, సూర్య ప్రకాష్, రాంబాబు, ప్రసాద్, సరస్వతి, నూర్జహాన్, ఈశ్వరమ్మ, హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story