Hyderabad: బస్తీలో కళ్ళు కాంపౌండ్ వద్దు రోడ్డుపై బైఠాయించిన ప్రేమ్ నగర్ వాసులు
Hyderabad: బంజారాహిల్స్ ప్రేమ్ నగర్‌లో కొత్తగా కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బస్తీ మహిళలు, యువకులు భారీ ధర్నా చేపట్టారు.
Hyderabad: బస్తీలో కళ్ళు కాంపౌండ్ వద్దు రోడ్డుపై బైఠాయించిన ప్రేమ్ నగర్ వాసులు
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్ నగర్‌లో చింతల్ బస్తి నుండి సాయిబాబా గుడి రోడ్డులో కళ్ళు కాంపౌండ్ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బస్తీ మహిళలు, యువకులతో కలిసి భారీ స్థాయిలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రహదారి ఆనంద్ నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ ప్రజలకు ప్రధాన మార్గం కావడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు, సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కళ్ళు కాంపౌండ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొని స్థానిక ప్రజలకు మద్దతు తెలిపారు. అలాగే బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ చైర్మన్ విప్లవ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, నవీన్, శ్రీధర్ యాదవ్, ప్రవీణ్, శివరాజ్, నరేష్ తదితర స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




