Balapur: బాలాపూర్‌లో దారుణం ప్రియురాలిని హత్య చేసి గోనెసంచిలో కట్టి!

Balapur: హైదరాబాద్ బాలాపూర్‌లో దారుణం. పెళ్లి చేసుకోమందని ప్రియురాలిని కత్తితో పొడిచి గోనె సంచిలో కట్టిన ప్రియుడు. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు.

RAHUL, MEERPET
Published on: 17 Aug 2026 9:54 AM IST
Balapur
X

Balapur: బాలాపూర్‌లో దారుణం ప్రియురాలిని హత్య చేసి గోనెసంచిలో కట్టి!

Balapur: ప్రేమించిన యువతిని హత్య చేసి గోనె సంచిలో మూటగట్టిన ఘటన హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన రెహనా (21) ను ప్రియుడు అహమ్మద్‌ సలాం (21) హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం అహమ్మద్‌ సలాం, రెహనా గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోకుండా ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. అయితే పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అహమ్మద్‌ సలాం ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి మూటగట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం.

సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు డయల్‌-100కు సమాచారం అందడంతో బాలాపూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఘటనాస్థలిని పరిశీలించారు.

మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడు అహమ్మద్‌ సలాం పోలీసులు గాలిస్తున్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET