Madhapur: కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్ 'బాకీ కార్డుల' పంపిణీ
Madhapur: కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై మాదాపూర్‌లో బిఆర్ఎస్ నిరసన. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ 'బాకీ కార్డులు' పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.
Madhapur: కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్ 'బాకీ కార్డుల' పంపిణీ
మాదాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాదాపూర్ లోని చంద్ర నాయక్ తండాలో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శిస్తూ, బిఆర్ఎస్ నాయకులు 'బాకీ కార్డులను' ఇంటింటికీ పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ... ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేవని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, రంగారావు, కార్తిక్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.




