LB Nagar: సరూర్ నగర్ స్టేడియంలో సందడి.. యువ క్రీడాకారులకు ఫ్రీగా స్పోర్ట్స్ కిట్లు!
LB Nagar: ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 'మై భారత్' కార్యక్రమంలో భాగంగా యువతకు ఉచితంగా స్పోర్ట్స్ కిట్లను అందజేసిన మధుయాష్కి గౌడ్.
LB Nagar: సరూర్ నగర్ స్టేడియంలో సందడి.. యువ క్రీడాకారులకు ఫ్రీగా స్పోర్ట్స్ కిట్లు!
ఎల్బీనగర్: సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా కు సంబంధించిన మై భారత్ కార్యక్రమంలో భాగంగా యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో స్పోర్ట్స్ మెటీరియల్ కిట్లను ఉచితంగా పంపిణీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మరియు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు స్వయంగా యువ క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ గారు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా క్రీడలను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువత అభివృద్ధి కోసం ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన యూత్ అధికారి ఐసయ్య గారు జిల్లా క్రీడాధికారి స్వర్ణలత గారు, రామచంద్ర రావు గారు, గజ్జి భాస్కర్ గారు, బత్తుల వేణు గారు, దాము మహేందర్ యాదవ్ గారు, సునీల్ బాబు గారు, నరేష్ గుప్త గారు, సాయి కిరణ్ గారు అంతటి శ్రీనివాస్ గారు, పాల్గొన్నారు.




