Vanasthalipuram: సాహెబ్ నగర్‌లో ఇళ్లు కోల్పోకుండా చూస్తాం మధుయాష్కి గౌడ్ హామీ!
Vanasthalipuram: సాహెబ్ నగర్ రోడ్డు విస్తరణలో పేదలెవరూ ఇళ్లు కోల్పోకుండా సీఎం రేవంత్‌తో మాట్లాడుతానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ హామీ ఇచ్చారు.
Vanasthalipuram: సాహెబ్ నగర్‌లో ఇళ్లు కోల్పోకుండా చూస్తాం మధుయాష్కి గౌడ్ హామీ!
Vanasthalipuram: వనస్థలిపురం సాహెబ్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణలో పేదలు ఇల్లు కోల్పోకుండా సీఎం గారితో పాటు ఉన్నతాధికాలతోనూ మాట్లాడి పరిష్కరిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు, సీనియర్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గార్లతో కలిసి మధుయాష్కీ గారు గారు ఈరోజు ఉదయం సాహెబ్ నగర్ ఓల్డ్ విలేజ్ లో పర్యటించారు.
రోడ్డు విస్తరణతో ఇల్లు కోల్పోతున్న బాధితులు, గ్రామస్తులతో కలిసి విస్తరణ చేపట్టనున్న రోడ్ల ను పరిశీలించారు. 80 అడుగుల మేర విస్తరణతో ఇళ్లు కోల్పోతున్నామని.. తాత ముత్తాతల నుంచి ఉన్న ఇల్లు కోల్పోవాల్సి వస్తుందని, తమకు న్యాయం చేయాలని మధుయాష్కి గారిని కోరారు. ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. హయత్ నగర్ లో పుట్టి పెరిగిన తనకు.. సాహెబ్ నగర్ గ్రామంతో, ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. తన ఇంటి ఆడపడుచులు ఇల్లు కోల్పోతే బాధ ఎలా ఉంటుందో తనకు కూడా అలాగే బాధ ఉంటుందన్నారు.
నా వద్దకు వస్తానంటే వద్దని చెప్పానని.. నేనే స్వయంగా వచ్చి పరిశీలిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చానన్నారు. అధికారులు ఆఫీసుల్లో కూర్చొని నిర్ణయాలు చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. పేదలు ఎవరూ ఇళ్లు కోల్పోకుండా సీఎం గారితో మాట్లాడతానని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ 80 అడుగులు కాకుండా ప్రస్తుతం ఉన్న 40 అడుగులకు వెడల్పు తగ్గించి.. స్థానికుల ఆస్తులు పోకుండా కాపాడుతామన్నారు.
మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు, రామ్మోహన్ గౌడ్ గారు కూడా మాట్లాడుతూ.. సాహెబ్ నగర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రెండు వైపు మార్గాల్లో రోడ్ల వెడల్పు తో స్థానికులు నష్టపోయే అవకాశం ఉన్నందున మధుయాష్కిగౌడ్ గారితో కలిసి సీఎం గారు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని సూచించారు. స్థానికులెవరూ ఆందోళనకు గురికాకూడదు అని భరోసా కల్పించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న గారు, సీనియర్ నాయకులు మకుటం సదాశివుడు గారు, డివిజన్ అధ్యక్షులు రమేష్ నాయక్ గారు, పర్వతి గణేష్ రెడ్డి గారు, నాయకులు ముద్దగోని సురేష్ గౌడ్ గారు, చంద్రకాంత్ గౌడ్ గారు, నారాయణ గౌడ్ గారు, సరస్వతి గారు, వినయ్ పటేల్ గారు, నగేష్ గౌడ్ గారు, కొత్త శ్రీధర్ గౌడ్ గారు, శశికాంత్ గారు, రాంబాబు గారు, నందకిషోర్ గారు తదితరులు పాల్గొన్నారు.




