Hyderabad: నాగోల్, బండ్లగూడ చెరువుల సుందరీకరణ మధు యాష్కి గౌడ్
Hyderabad: నాగోల్, బండ్లగూడ చెరువులను సందర్శించిన మధు యాష్కి గౌడ్. గత బీఆర్ఎస్ పాలనలో చెరువులు మురికి కూపాలుగా మారాయని విమర్శ. చెరువుల సుందరీకరణకు హామీ.
Hyderabad: నాగోల్, బండ్లగూడ చెరువుల సుందరీకరణ మధు యాష్కి గౌడ్
హైదరాబాద్: గత ప్రభుత్వంలో చెరువులను మురికి కూపాలుగా మార్చారని టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ విమర్శించారు. ఈరోజు ఉదయం GSI డివిజన్ లోని బండ్లగూడ చెరువును, నాగోల్ డివిజన్ లోని నాగోల్ చెరువును మధు యాష్కి గారు సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల సమయంలో గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే పడవల్లో తిరిగి హడావుడి చేశారే తప్ప ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించారు.
గత BRS పాలనలో చెరువులు, కుంటలు కబ్జాలకు గురవడమే కాకుండా మురికి కూపాలుగా మార్చారని పేర్కొన్నారు. బండ్లగూడ, నాగోల్ చెరువుల్లో మురుగునీటిని కలపడంతో దుర్వాసన, కలుషిత వాతావరణంతో ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. మురుగునీరు, వరదనీటి కాలువలు వేర్వేరుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.
బండ్లగూడ, నాగోల్ చెరువు సమస్యలను GHMC కమిషనర్, HYDRA కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని, రెండు శాఖల సమన్వయంతో చెరువులను కబ్జాల నుంచి తొలగించి అభివృద్ధి చేస్తామన్నారు. CM రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్నందున వారి దృష్టికి తీసుకెళ్లి సుందరీకరణ పనులు చేపడతామన్నారు.
గత BRS ప్రభుత్వం నగరంలోని నిధులన్నీ కాళేశ్వరానికి తరలించిందని, కానీ CM రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నిధులను నగర అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మధు యాష్కి గారు అయ్యప్ప కాలనీ లోనూ పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, వరద నీటితో పడుతున్న ఇబ్బందులను వారు వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు: టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్లు దారిపల్లి రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, డివిజన్ అధ్యక్షురాలు మంజుల రెడ్డి, లింగాల కిషోర్ గౌడ్, బుడ్డా సత్యనారాయణ, శశిధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.




