Malkajgiri: మల్కాజిగిరి నుంచి ఉస్మానియాకు మాదిగ విద్యార్థుల బైక్ ర్యాలీ!
Malkajgiri: మల్కాజిగిరి నుంచి ఎమ్ఎస్పీ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థి ప్రతినిధుల జాతీయ సదస్సుకు బైకులపై భారీగా తరలివెళ్లిన విద్యార్థులు, యువత.
Malkajgiri: మల్కాజిగిరి నుంచి ఉస్మానియాకు మాదిగ విద్యార్థుల బైక్ ర్యాలీ!
Malkajgiri: మాదిగ విద్యార్థి ప్రతినిధుల జాతీయ సదస్సుకు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంఎస్పీ (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో విద్యార్థులు,యువత పెద్ద ఎత్తున బైకుల పైన తరలివెళ్లారు. ఆనంద్బాగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు బయలుదేరారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి తిప్పారపు లక్ష్మణ్, జాతీయ నాయకులు కేశపాగ రామచందర్ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యే జాతీయ సదస్సుకు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రత్యేక డ్రెస్ కోడ్తో విద్యార్థులు సదస్సుకు తరలివెళ్లడం జరిగిందన్నారు.
జాతి, సమాజ అభివృద్ధికి భవిష్యత్లో చేపట్టాల్సిన ఉద్యమాలు, సామాజిక అంశాలపై విద్యార్థులకు ఈ సదస్సులో దిశానిర్దేశం జరుగుతుందని పేర్కొన్నారు.విద్యార్థులు తమ హక్కులు, సామాజిక బాధ్యతలు, ఉద్యమాలపై అవగాహన పెంపొందించుకోవడానికి జాతీయ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.విద్యార్థులు భవిష్యత్లో సామాజిక సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్, వి.హెచ్.పి.ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలకూర స్వామి,మల్కాజిగిరి మండల అధ్యక్షుడు యు.రామచందర్, బోగారం పవన్, చిన్నబాబు, ఎంఎస్పీ ఆల్వాల్ మండల అధ్యక్షుడు మధు, బత్తిని శివ, పోశాలు,నరేష్, కార్తీక్, భవాని,తరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




