Madugula: జాబ్ డ్రైవ్ రెండో విడతలో 19 మందికి ఉద్యోగాలు
Madugula: మాడ్గుల జాబ్ డ్రైవ్ ద్వారా తుక్కుగూడ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో రెండో విడతలో 19 మంది, మొత్తంగా 71 మందికి ఉద్యోగాలు లభించాయని రాఘవేందర్ రెడ్డి తెలిపారు.
Madugula: జాబ్ డ్రైవ్ రెండో విడతలో 19 మందికి ఉద్యోగాలు
మాడ్గుల: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేపట్టిన ‘సుంకిరెడ్డి – ఉద్యోగ భరోసా’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.
గత నెల 28న మాడ్గులలో నిర్వహించిన 26వ జాబ్ డ్రైవ్‌లో భాగంగా తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో మొదటి విడతలో 52 మంది, రెండో విడతలో మరో 19 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో రెండు విడతల్లో మొత్తం 71 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
రెండో విడతలో మాడ్గుల నుంచి 10 మంది, నర్సాయిపల్లి నుంచి ఒకరు, ఇర్విన్ నుంచి ముగ్గురు, కలకొండ నుంచి ఇద్దరు, బ్రాహ్మణపల్లి నుంచి ఇద్దరు, సుద్దపల్లి నుంచి ఒకరు ఎంపికయ్యారు. మిగిలిన అభ్యర్థులకు కూడా విడతలవారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.
ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఉద్యోగ భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమకు ప్రముఖ కంపెనీలో అవకాశం కల్పించినందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి మహేష్, ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.




