Hyderabad: నీట్ పేపర్ లీక్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
Hyderabad: ఆర్ఎస్ఎస్ వ్యక్తుల వల్లే నీట్ పేపర్ లీక్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రధాని మోదీ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
Hyderabad: నీట్ పేపర్ లీక్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ మూలాల ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రపర్ ను లీక్ చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి చర్యల వల్ల 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆయన అన్నారు.
ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన నారాయణగూడలో ఛాత్రోన్ కి గూంజ్ విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తుంటే , పేపర్ లీకులతో వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శించారు.
ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ , కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ లు ఇప్పటికి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ విద్యార్థుల హక్కులు కోసం రాజస్థాన్ కోటా లో చేపట్టిన ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.




