Maheshwaram: అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ – అభినందించిన బంధువులు
Maheshwaram: మహేశ్వరం మండలం కేసీ తండాకు చెందిన గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా.. 108 అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Maheshwaram: అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ – అభినందించిన బంధువులు
మహేశ్వరం: పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మహేశ్వరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని పెట్ల బురుజు లో ని జనరల్ మెటర్నరీ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యలో రీతు గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ రావడంతో అంబులెన్స్ సిబ్బంది అంబులెన్స్ ను పక్కకు నిలిపి పురిటి నొప్పులతో ఉన్న మహిళకు నార్మల్ డెలివరీ చేయడం జరిగింది నా మహిళా పండంటి మగ బిడ్డ జన్మనిచ్చింది.
ఎంతో సమయస్ఫూర్తితో సమయానికి వచ్చి అంబులెన్స్ లోనే సాధారణ డెలివరీ చేసిన అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సురేందర్ పైలెట్ యాదయ్య లను ఆ మహిళా బంధువులు అభినందించారు తర్వాత తల్లి బిడ్డలను హైదరాబాదులోని పేట్ల బురుజు ప్రభుత్వ మెటర్నటి ఆస్పత్రికి తరలించారు.




